Dr. ATLA SRINIVAS REDDY  MA(Psy),MSc(M),MCJ,MEd,PGDCA,PGDGC,PGDFDR,PGCPC,PhD(CP)

EDUCATIONALIST,COUNSELLING PSYCHOLOGIST FAMILY COUNSELLOR

VSHS 29.1.2017

KNR CHIEF WHIP REPRESENTATION 5.2.2017

ZPHS GUMLAPUR 5.3.2017

ARTICLE ON 7.4.2017

DEPRESSION AVAGAHANA SADASSU NANDINI CONVENT 7.4.2017

DEPRESSION SEMINAR VAAGDEVI DEGREE COLLEGE HUZURABAD 7.4.17

ARTICLE ON SWOT 3.5.2017

NLP WORKSHOP 4.5.17

STRESS ARTICLE 12.5.17

WORLD HYPER TENSION DAY Article 17.5.2017 Andhra Jyothi Middle page

NLP WORKSHOP APOORVA 20.5.2017

STATE LEVEL DISTRICT RESOURCE PERSONS TRAINING AT TS IPARD HYDERABAD

తెలంగాణ విద్యాశాఖ శిక్షణా కార్యక్రమం తేది: 23.5.2017 నుండి 25.5.2017 వరకు జిల్లా రిసోర్స్ పర్సన్ ల శిక్షణా కార్యక్రమం TSIPARD రాజేంద్రనగర్ హైదరాబాదు

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కేటాయింపు చేస్తున్న ప్రాజెక్టులు విస్త్రత చర్చలో జగిత్యాల జిల్లా నుండి ప్రాతినిధ్యం అట్ల శ్రీనివాస్ రెడ్డి

 

YUVA SUMMERCAMP 26.5.2017 AT JAYASHANKAR BHOOPALAPALLY ORGANISED BY TELANGANASTATE POLICE DEPARTMENT JAYASHANKAR BHOOPALAPALLY DISTRICT

జయశంకర్ భూపాలపల్లి గౌరవ జిల్లా SP భాస్కరన్, గౌరవ DSP కె.ఆర్.కె. ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో గౌరవ కాటారం SI కిరన్ గారి సారధ్యంలో యువ సమ్మర్ క్యాంపు 9 వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుచున్న విద్యార్థులకు ఏకాగ్రత, లక్ష్య నిర్ధారణ పై అట్ల శ్రీనివాస్ రెడ్డి కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ & ఫ్యామిలీ కౌన్సెలర్ వర్క్ షాప్ తేది:26.5.2017 కాటారం జూనియర్ కాలేజి

అట్ల శ్రీనివాస్ రెడ్డి

కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ & ఫ్యామిలీ కౌన్సెలర్

YUVA SUMMERCAMP 26.5.2017 AT JAYASHANKAR BHOOPALAPALLY ORGANISED BY TELANGANASTATE POLICE DEPARTMENT JAYASHANKAR BHOOPALAPALLY DISTRICT జయశంకర్ భూపాలపల్లి గౌరవ జిల్లా SP ఆర్.భాస్కరన్ (IPS), గౌరవ DSP కె.ఆర్.కె. ప్రసాదరావు, కాటారం సబ్ డివిజన్ పోలీస్ గారి సారధ్యంలో యువ సమ్మర్ క్యాంపు 9 వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుచున్న విద్యార్థులకు ఏకాగ్రత, లక్ష్య నిర్ధారణ, పరీక్షల సమయంలో ఒత్తిడి తట్టుకోవడానికి మెలకువల పై అట్ల శ్రీనివాస్ రెడ్డి కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ & ఫ్యామిలీ కౌన్సెలర్ వర్క్ షాప్ నిర్వహణ పై జిల్లా SP గౌరవ ఆర్. భాస్కరన్ (IPS) గారి చేతుల మీదుగా సన్మానం కార్యక్రమంలో మెమెంటో బహుకరించారు తేది: 01.06.2017 వేదిక: YTC కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గౌరవ SP, కాటారం సబ్ డివిజన్ గౌరవ DSP,CI,SI గార్లకు కృతజ్ఞతలు

అట్ల శ్రీనివాస్ రెడ్డి కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ & ఫ్యామిలీ కౌన్సెలర్

District Educational Officer Jagtial Telangana State Appreciation 02.06.2017

WORLD SUICIDE PREVENTION DAY 09.09.2017

WORLD SUICIDE PREVENTION DAY ARTICLES 10.9.17

WORLD SUICIDE PREVENTION DAY SEMINAR AT GHS OLD JAGTIAL 10.9.17

WORLD SUICIDE PREVENTIONDAY SEMINAR AT SRR GASTRO & LIVER SUPER MULTI SPECIALITY HOSPITAL KARIMNAGAR

NIMHANS NATIONAL LEVEL PSYCHOLOGISTS FAMILY COUNSELLORS CONFERENCE 18 & 19 SEPTEMBER 2017

లైఫ్ స్కిల్స్(జీవన నైపుణ్యాలు) పై  సర్టిఫికేట్ కోర్స్ చేతన ఫౌండేషన్ నిర్వహణకు అనుమతి,అడ్మిషన్ లకు చివరి తేది: అక్టోబర్ 15

 

         చేతన ఫౌండేషన్ కు  లైఫ్ స్కిల్స్ (జీవన నైపుణ్యాలు) 6 నెలల  సర్టిఫికేట్ కోర్స్ నిర్వహణకు యు.జి.సి. గుర్తింపు కలిగిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ దూరవిద్యాకేంద్రం అనుమతినిచ్చిందని చేతనఫౌండేషన్ జగిత్యాల జిల్లా ఆర్గనైజర్ కొలుముల శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

        ప్రస్తుత పరిస్తితులలో సమాజంలో జీవన నైపుణ్యాలపై చైతన్య పరచాలనే లక్ష్యంతో ఈ కోర్సు ను నిర్వహిస్తున్నామని, ఆర్థికంగా వెనుకబడిన వారు, వికలాంగులకు, అనాధలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో చేతన ఫౌండేషన్ ఫీజులో 50% రాయితీ కల్పిస్తున్నామని, జీవన నైపుణ్యాలపై ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా అవగాహన తరగతులను  నిర్వహిస్తున్నామని తెలిపారు.

        7 వతరగతి నుండి పి.జి. స్తాయి వరకు చదువుచున్న వారు, చదివిన వారు, అతి స్వల్ప ఫీజుతో 500/- నుండి 1000/- తో ఈ సర్టిఫికేట్ కోర్స్ యందు ఆన్ లైన్ లో కూడా అక్టోబర్ 10 వ తేది లోపు  ప్రవేశాన్ని పొందవచ్చు.మరిన్ని ఇతర వివరాలకుhttp://chethanafoundation.jimdo.com/life-skills  వెబ్ సైట్ ను లేదా 9703935321 నంబర్ లలో సంప్రదించ గలరు.

WORKSHOP PROGRAMME CONDUCTED ON LIFE SKILLS AT ZPHS VELGATUR JAGTIAL DIST

పత్రికా ప్రకటన

చేతన ఫౌండేషన్ ఆద్వర్యంలో “మానసిక ఆరోగ్యం (మార్పుకు చిహ్నం)” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతను గుర్తించాలి – కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయిన పల్లి వినోద్ కుమార్ 

          చేతన ఫౌండేషన్ ఆద్వర్యంలో అక్టోబర్ 10న  ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య వారోత్సవాలలో (అక్టోబ ర్ 4 వ తేది నుండి 10 వ తేది వరకు)  భాగంగా ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి చేతన ఫౌండేషన్ వ్యవస్తాపకులు రచించిన “మానసిక ఆరోగ్యం(మార్పుకు చిహ్నం)” పుస్తక ఆవీష్కరణ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరైన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయిన పల్లి వినోద్ కుమార్ “మానసిక ఆరోగ్యం(మార్పుకు చిహ్నం)” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శరీర దృఢత్వానికి ఇచ్చే ప్రాధాన్యతతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మానసిక ఆరోగ్యం పై ప్రజలు చైతన్యం కావాలని సూచించారు.

        ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, ఎం.ఎల్.ఏ. గంగుల కమాలాకర్, ఐ.డి.సి. చైర్మెన్ ఈద శంకర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మెన్ ఏనుగు రవీందర్ రెడ్డి, 50 వ డివిజన్ కార్పోరేటర్ వొంటెల సుమ సత్యనారాయణ రెడ్డి, వై. సునీల్ రావు, బండారి వేణు, నలువాల రవీందర, బోనాల శ్రీకాంత్, నాయకులు వొంటెల సత్యనారయణ రెడ్డి, కట్ల సతీష్, ఎడ్ల అశోక్, చల్ల హరిశంకర్ చేతన ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వివేక్ కుమార్, సభ్యులు అట్ల పూర్ణ చందర్ రెడ్డి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2017

పనిచేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యం (Mental Health In The Workplace)

        ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలను(వార్త పత్రికలు ప్రచురించిన)  చూస్తే పని ప్రదేశాలలొ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం పై ఆందోళన కలిగించే అంశం ఒక పోలీసు ఉద్యోగి తన రివాల్వర్ తో తనే కాల్చుకోవడం, గ్రూప్ 1 అధికారులు ఒత్తిడికి చిత్తవుతున్నారు,  పని చేసే ప్రదేశాలలో లైంగిక వేదింపులతో ఠాణా మెట్లెక్కుతున్న మహిళలు, సమాన పనికి సమాన వేతనం అందివ్వడం లేదని రోడ్డు పై నిరసనలు చేస్తున్న ఉద్యోగులు కార్మికులు, పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని వాపోయే పలువురు ఉద్యోగుల నేపథ్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్యదినోత్సవం సందర్భంగా ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి “పనిచేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యం” పై ప్రత్యేక కథనం

        ఒక మనిషి సంతోషంగా జీవించడానికి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలలో మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 10 అక్టొబర్, 1992 లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ స్తాపించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 25 వ సారి మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్ఠ నివేదిక ప్రకారం భారతదేశంలో 5 కోట్ల మంది డిప్రెషన్ తో బాధ పడుతున్నారు. విశ్వంలోని జనాభాలో 12% మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. దాదాపుగా 450 మిలియన్ లకు పైగా జనాభా మానసిక అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన ఒక సర్వే రిపోర్టు ప్రకారం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కార్పరేట్ ఇండియాలోని ప్రతి ఇద్దరు ఉద్యోగులలో ఒకరు ఆందోళన మరియు నిరాశకు గురవుతున్నారు.ఈ సంవత్సరం “పనిచేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యం” అనే అంశం పై చైతన్య పరచాలని పిలుపునివ్వడం జరిగింది.

        వ్యవసాయ రంగం నుండి మొదలు కొని  పరిశ్రమలు, ఆర్ధిక రంగం, ప్రభుత్వ, సాంకేతిక, కార్పోరేట్ రంగం పనిచేసే ప్రదేశాలలో ఉద్యోగుల, కార్మికుల, కర్షకుల మానసిక ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురవుతున్నదని, గత సంవత్సరం అసోచామ్ (Associated Chambers of Commerce and Industry of India విడుదల చేసిన అధ్యయన రిపోర్టు ప్రకారం 42.5% మంది ఉద్యోగులు డిప్రెషన్ తో బాధ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే కార్పోరేట్ ప్రపంచంలో పని చేసే ప్రైవేట్ ఉద్యోగులలో ఆందోళనను, ఒత్తిడి స్తాయిలను ఎక్కువగా కలిగి ఉన్నారని తెలిపింది.

        ప్రపంచంలోని వయోజనులు రోజులో ఎక్కువ సమయాన్ని పని చేసే ప్రదేశంలోనే గడుపుతున్నారు. ఒడిదుడుకులు లేని జీవన ప్రయాణం కొనసాగడానికి నిర్ణయించే అంశాలలో ఒకటి పని చేసే ప్రదేశంలోని అనుభవాలు అనడంలో సందేహం లేదు. పని మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది, కాని నెగెటివ్ ఆలోచనలతో కూడిన వాతావరణంలో పని చేయడం శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ప్రస్తుత సమాజంలోని యువత శారీరక దృడత్వంపై కనబరిచే శ్రద్ద , మానసిక దృడత్వం పై కనీస అవగాహన లేక పోవడం ఆందోళన కలిగించే అంశం.

పనిచేసే ప్రదేశంలో మానసిక అనారోగ్యానికి కారణాలు:

 

మానసిక సమస్యతో బాధపడుచున్న ప్రతి నలుగురిలో ఒకరు పని ప్రదేశంలో డిప్రెషన్ కు గురవుతున్నారు.

ఎక్కువ పని గంటలు పని చేయడం, టార్గెట్లను చేరుకోవడం, ఇంటి నుండి పనిచేసే ప్రదేశానికి ప్రయాణాలు, కార్యాలయాలకు చేరుకోవడంలో ట్రాఫిక్ సమస్యలు,బాసిజం, చులకన బావంతో చూడబడటం, ప్రాధాన్యతలను తగ్గించడం, ఇంక్రిమెంట్ లలో కోత, ప్రమోషన్ లను నిలిపి వేయడం, పని చేసే ప్రదేశాలలో వేధింపులు, బెదిరింపులు,సంస్థాగత లక్ష్యాలు,  పని చేసే ప్రదేశాలలో ఆరోగ్య, భద్రతా నియమాలు పాటించక పోవడం, బావోద్వేగ అలసట, నిద్ర లేమి,క్రమ శిక్షణా చర్యలు, కొనసాగుతున్న విచారణలు, భారీ రుణాలు తీసుకోవడం

ఆరొగ్యవంతమైన కార్యాలయాల ఏర్పాటు

ప్రభుత్వ సంస్ఠలు, ప్రభుత్వేతర సంస్థలు వారీ ఆధీనంలో పని చేసే వారీ యొక్క మానసిక ఆరోగ్యం పై పరిశీలన చేస్తుండాలి. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ సంస్థ బాగుగా పనిచేస్తుంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం సంస్థ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావన్ని చూపుతుంది.ప్రభుత్వాలు చట్టాలను చేయడం, పని గంటలకు సంబందించి మార్గదర్శకాలను విడుదల చేయడం, ఉద్యోగుల శ్రేయస్సును ప్రోత్సహించడం, ఉద్యోగుల కెరీర్ అభివృద్ది కోసం కార్యక్రమాలు రూపొందించడం, ఉద్యోగుల పనితీరును బట్టి ప్రోత్సహాకాలను అందించటం, ఉద్యోగుల అవసరాలను గుర్తించటం, ఉద్యోగుల పని సామర్ద్యాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహణ

ప్రభుత్వాలు, సంస్థలు చేస్తున్నవి, చేయాల్సినవి:

 

పని చేసే ప్రదేశాలలో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి.

శారీరక అనారోగ్యానికి  ఇచ్చే ప్రాధాన్యతను మానసిక ఆరోగ్యానికి కూడా ఇవ్వాలి.

ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిరక్షించే కార్యక్రమాలు రూపొందించాలి, పని జీవితానికి సమ ప్రాధాన్యతను ఇవ్వాలి.

మానసిక రుగ్మతలపై అవగాహన శిక్షణాకార్యక్రమాలు నిర్వహించాలి.

ఉద్యోగి ఆరోగ్య సమాచారానికి గోప్యత, రక్షణ కల్పించాలి.

సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.

ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు గుర్తుంచుకోవాల్సినవి:

 

ఉద్యోగులు మానసిక రుగ్మతలను తనకు తానుగా విశ్లేషణ చేసుకోవాలి.

ప్రధానంగా డిప్రెషన్,ఒత్తిడిలపై చిరాకు,కోపం లాంటి ముందస్తు సూచనలు గ్రహిస్తూ ఉండాలి.

ముందుగా గుర్తుంచుకోవాల్సింది మీరు ఆరోగ్యంగా , సంతోషంగా ఉండడానికి అవసరమైన సందర్భంలో తప్పక సహాయాన్ని తీసుకోవాలి.

మీ కోసం బలమైన మద్దతు ఇచ్చే వ్యవస్థ ఉందని నిర్దారించుకోండి.

మీ మానసిక ఆరోగ్యానికి సంబందించి, శ్రేయోభిలాషులు/ సూపర్ వైజర్/ పై అధికారుల సహాయాన్ని కోరండి లేదా మీ వ్యక్తి గత వైద్యుని ద్వారా  పంచుకోండి.

మీరు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి మీ శరీరం,మెదడు చేసే పనుల ప్రాధాన్యతను గుర్తంచాలి.

మానసిక ఆరోగ్య నిపుణులు నిర్వహించే మానసిక శిక్షణాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి.

మీరు పని చేసే ప్రదేశం మానసిక ఆరోగ్యానికి సురక్షితం కాకపోతే అక్కడి నుండి మరో చోటికి మారండి.

 

MENTAL HEALTH STRESS MANAGEMENT WORKSHOP AT TRINITY COLLEGE

1200 STUDENTS PARTICIPATED

తేది: 15.10.2017 రోజున హైదరాబాద్ లో జరిగిన పి.ఆర్.టి.యు. తెలంగాణ అధికార పత్రిక ఆవిష్కరణ సమావేశంలో ముఖ్య అథిధిగా హాజరైన గౌరవ భారీ నీటి పారుదల శాఖా మాత్యులు తన్నీరు హరీశ్ రావు గారు, గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ శాసన మండలి  పాతూరి సుధాకర్ రెడ్డి గారలు మొట్ట మొదటి  తెలంగాణ ఉపాధ్యాయదర్శిని పత్రికను (పి.ఆర్.టి.యు. తెలంగాణ అధికార పత్రిక) విదుదల చేయడం జరిగింది. మొదటి సంచికలో “విశ్వంలో సృష్టికి ప్రతి సృష్టి చేయగల ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్న సందర్భంగా రాసిన ఆర్టికల్ ప్రచురించినందున పి.ఆర్.టి.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం. అంజా రెడ్డి, రాష్త్ర ప్రధాన కార్యదర్శి యం. చెన్నయ్య , పత్రికా సంపాదక వర్గానికి, శ్రేయోభిలాషులందరికి  నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు

చదవండి చదివించండి

 

డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయుడు,కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్

పి.ఆర్.టి.యు. తెలంగాణ జగిత్యాల జిల్లా అధ్యక్షులు

రాఘవన్ కమిటి సిఫారసు మేరకు,12.6.2009, సి.ఏ. నం. 887/2009  సుప్రీం కోర్టు ఉత్తర్వులననుసరించి, సమైక్య ఆంద్ర ప్రదేశ్ లో జి.ఓ. నం. 19 తేది: 08.03.2010   విడుదలకు అనుగుణంగా తేది: 05 ఫిబ్రవరి 2017 రోజున డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వ శాసనమండలి చీఫ్ విప్ శ్రీ పాతురి సుధాకర్ రెడ్డి గారికి విద్యాలయాలలో సైకాలజిస్ట్ ల సేవలను వినియోగించుకోవాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.

విద్యా సంస్థలలో కౌన్సెలింగ్ సెంటర్ ల ఏర్పాటు దిశలో తెలంగాణ సర్కారు తీసుకొన్న నిర్ణయం పట్ల హర్షం – డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి  కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ & ఫ్యామిలీ కౌన్సెలర్, చేతన ఫౌండేషన్ వ్యవస్తాపకులు విద్యార్థుల సామర్ద్యాల మేరకు విద్యా సంస్థలు బోధన చేసే విధంగా,విద్యార్థుల ఆత్మబలిదానాల నివారణ దిశగా విద్యా సంస్థలలో కౌన్సెలింగ్ సెంట ర్ ల ఏర్పాటు దిశలో తెలంగాణ సర్కారు తీసుకొన్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డా.  అట్ల శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులలో ఒత్తిడి ఎక్కువగా పెరుగుతోంది ఇది ఆందోళన కలిగించే విషయం. విద్యార్థులు  నిర్డేశించుకున్న లక్ష్యాలు  సాధించాకోవాలనే తపనతో, ఒత్తిడిని ఎదుర్కోలేక అనారోగ్యం పాలుకావడం జరుగుతోంది. భరించలేని ఒత్తిడి పెరిగినపుడు ఆత్మ బలిదానాలకు కూడా  గురవుతున్నారు విద్యార్థులకు సరైనా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు, లక్ష్య సాధనలు సులభతరం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు విద్యార్థుల సామర్ధ్యాల మేరకు విద్యను అభ్యసించునట్లు , పాఠశాల యాజమాన్యకమిటీలకు, విద్యార్థుల తల్లిదండ్రులలో చైతన్యం కలిగించడానికి సైకాలజిస్ట్ లు సిద్దంగా ఉన్నామని తెలిపారు.

Download
mental health book print potrait-min.pdf
Adobe Acrobat Document 4.6 MB
మెదడుకు సానా బెట్టండిలా.......
మెదడును చలాకీలా పనిచేయించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇవి జ్ఞాపకశక్తిమెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తాయి. మెదడు సమర్థవంతంగా పని చేయాలంటే ధ్యానం, యోగా, పోషక విలువలు గల ఆహారం, శారీరక మరియు మానసిక వ్యాయామంలు ఎంతో దోహదం చేస్తాయి.
        ఆధునిక పోకడలతో, అభివృద్ది చెందుతున్న టెక్నాలజీ తో పాటుగా మెదడుకు కొంత భారం తగ్గిందనుకొంటున్నారు కదా............ ఒక రోజు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదయాన్నె లేచి ఆఫీసుకు బయలుదేరుదామని సిద్దమయ్యాడు తీరా టై కనిపించడం లేదని లేదా వెహికిల్ కీ కనిపించడం భార్యపై చిందులు వేసే సంఘటనలు కోకోల్లలు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవితాలు, జీవన విధానాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచాన్ని మొబైల్ ఫోన్ లోనే వీక్షిస్తున్న మనిషికి అప్పుడప్పుడు విచిత్రమైన కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సమయానికి గుర్తుకు రాని యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు , సీక్రేట్ కోడ్ లతో మతి మరుపు వచ్చిందేమోనని అప్పుడు మెదడు గుర్తు చేస్తుంది.
        ఒకప్పుడు మతిమరుపు అనేది తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, నానమ్మలు, వృద్దులలో ఉండేది. ప్రస్తుతం ఇది అందరిని వేధిస్తున్న సమస్య. విద్యార్థులకు పరీక్షలలో ప్రశ్నలకు జవాబులు గుర్తుకు రాక వేదనకు గురయ్యేవారెందరో, వాస్తవానికి గత దశాబ్దకాలం నుంచి గమనిస్తే మనం మెదడును పూర్తిస్తాయిలో వాడుకోవడం లేదనే చెప్పాలి. ప్రతి అవసరానికి ఏదో ఒక సాధనం మీద ఆధార పడుతూ మెదడు వాడకాన్ని పూర్తిగా తగ్గించేశాం. దీనివల్ల మెదడు పని చేయక డిమోన్షియా, అల్జీమర్స్ వంటి తీవ్ర మతి మరుపు సమస్యల ముప్పు పెరుగుతుంది.
        2015 నాటి ప్రపంచ అల్జీమర్స్ నివేదిక ప్రకారం ...... మనదేశంలో 41 లక్షలమంది అల్జీమర్స్ తో బాధ పడుతున్నారు. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా డిమోన్షియాతో బాధపడే వారిలో 50% ఆసియాలోనే ఉంటారని హెచ్చరిస్తున్నారు. కాబటి వీలైనవంతవరకు మెదడుకు పని చెప్పడం ఉత్తమం.
పాటించాల్సిన పద్దతులు:
ఒంటికాలు వ్యాయామం: ఏక పాదాసనం ఒక కాలు పై నిలబడి చేసే వ్యాయామాలు శరీర నియంత్రణకు, తూలి కింద పడకుండా ఉండటానికిజ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటానికి దోహదం చేసే నాడీ కణాలను ప్రేరేపిస్తాయి.
మానసిక వ్యాయామం: మెదడుకు పదును పెట్టె పదకేళీలు, సుడోకు, లాజికల్ సమస్యల సాధన, పజిల్స్ , అబ్రివేషన్స్ గుర్తుకు తెచ్చుకోవడం, ద్యానం లాంటివి చేస్తూ ఉండాలి.
కొత్త విషయాలు అన్వేశిస్తూ నేర్చుకోవడం:  మెదడులో సమాచార ప్రసారం ఒక నాడీ కణం నుంచి మరో నాడీ కణానికి ప్రసరిస్తూ ఉంటుంది. కొత్త విషయాలతో నాడి కణాల మధ్య కొత్త బంధాలు ఏర్పడుతాయి. ఇలాంటి కొత్త బంధాలు మెదడును చురుకుగా తయారు చేస్తుంది. కొత్త బాష, సంగీతం, వంటలు... మొదలగునవి.
కొత్త వ్యక్తులతో పరిచయాలు: మనకు మనమే ఏదో ఒక పనిని కల్పించుకొని దానిలో నిమగ్నం కావడం, కొత్త వ్యక్తులను కలవడం, పరిచయాలు, ఆలోచనా విధానాలలో మార్పు చేసుకోవడం, సాధారణంగా మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి వారినే కలుస్తూ ఉంటాం మంచిదే కాని ఇతర వృత్తుల వారినే కలిస్తే వైవిధ్య భరిత ఆలోచనలు వస్తాయి, కొత్త విషయాలు తెలుస్తాయి.
శారీరక వ్యాయామం: రోజూ కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేస్తే శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నిద్ర: రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్ర పోవడం వల్ల జ్ఞాపకాలు స్తిర పడుతాయి. ఏకాగ్రత కుదురుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
మెదడు చురుకుగా పని చేయడానికి పోషక ఆహారం
విటమిన్ బి, సి, ఇ, కె. :  మెదడు క్షీణతను తగ్గించడానికి, విటమిన్ బి6, బి 12, ఫోలిక్ ఆమ్లం, కలిగిన ఆకు కూరలు, చికెన్ , గ్రుడ్లు వంటి వాటిలొ ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, బత్తాయి, విటమిన్ ఇ, (విషయ గ్రహణ శక్తి) దంపుడు బియ్యం, మరియు విటమిన్ కె అధికంగా ఉండే అరటి, గోబి పువ్వు లాంటివి తీసుకోవాలి.
పొట్టు తీయని ధాన్యాలు: మెదడుకు నిరంతరం శక్తి అందుతేనే ఏకాగ్రత కుదురుతుంది, పొట్టు తీయని ధాన్యాలు తింటే నిధానంగా జీర్ణ మవుతూ రక్తంలోకి నెమ్మదిగా గ్లూకోజు విడుదల అవుతూ మెదడుకు నిరంతరం శక్తి అందుతుంది. కాబట్టి దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నల వంటి ధాన్యాలు తినడం అలవాటు చేసుకోవాలి.
చేపలు:  మెదడుకు కీలకమైన కొవ్వు ఆమ్లాలు మన శరీరం తయారు చేసుకోలేదు.వీటిని ఆహారం ద్వారానే పొందాలి. చేపలు, అవిసెలు, సోయాబీన్స్ వంటివి తరచుగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు, గుండే పనితీరు మెరుగవుతుంది. పై వాటితో పాటుగా జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించే జింక్ , ఒత్తిడిని తగ్గించే మెగ్నిషియం, మూడ్ ని ఉత్సాహపరిచే సెరటోనిన్ అధిక మొత్తంలో లభించే గుమ్మడి గింజలు తీసుకోవాలి.
Dr. అట్ల శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయుడు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్
MA(Psy), MSc(M), MEd, MCJ, PGDCA, PGDGC, PGDFDR, PGCPC, PhD(CP)
చేతన ఫౌండేషన్ వ్యవస్తాపకుడు

life skills contact class 19.11.17 nandini convent school

International child rights day celebrations 20.11.2017

అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా పోలీసుశాఖ, చైల్డ్ వెల్ ఫేర్ డిపార్ట్ మెంట్ , విద్యాశాఖ సంయుక్తంగా పెద్దపల్లి పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్ యందు నిర్వహించబడిన బాలల హక్కుల పై అవగాహన సదస్సులో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిగారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏ.సి.పి.. సింధు శర్మ(ఐ.పి.ఎస్) గారు, డి.సి.పి. విజయేందర్ రెడ్డి గారు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్ రావు గారు, జిల్లా వెల్ ఫేర్ ఆఫీసర్ పద్మావతి గారు, సి.ఐ. మహేశ్ గారు, చిల్డ్రెన్ ప్రొటెక్షన్ చైర్మెన్ కొమురయ్య గారు, ఐ.సి.పి.ఎస్. పర్వీన్ గారు, ఎస్.ఐ. జగదీశ్వర్ గారు, విద్యార్థులు, ఫ్రెండ్లీ టీచర్ , పాఠశాలల ఉపాధ్యాయులు, ఎస్.ఎం.సి. సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా  పోలిస్ శాఖ, పెద్దపల్లిజిల్లా చైల్డ్ వెల్ ఫేర్ డిపార్ట్ మెంట్ , పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ, పెద్దపల్లి ఎస్.ఎస్.ఏ. సెక్టోరల్ అధికారులు గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు.

డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయుడు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్

ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పంతోనే విజయం దాసోహం - *డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి* కౌన్సెలింగ్ సైకాలజిస్ట్

కె.జి.బి.వి. గర్రెపల్లి యందు పదవతరగతి చదువుచున్న విద్యార్థులకు *జంపాల పద్మ*  సెక్టోరల్ అధికారి, జి.సి.డి.ఓ. పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ గారి ఆద్వర్యంలో నిర్వహించబడిన మోటివేషనల్ తరగతులకు ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ *డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి* మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం తో విజయాన్ని తమ స్వంతం చేసుకోవచ్చని అన్నారు.

లక్ష్య సాధనలో టైం మేనేజ్ మెంట్ (సమయపాలన) ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. లక్ష్యం, పట్టుదలతో ఇష్టంతో చదివితే 10 జి.పి.ఏ పదవతరగతిలో సులువుగా సాధించవచ్చు. విద్యార్థి దశ నుండే జీవన నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఎలాంటి ఒడిదుడుకులెదురైనా ఎదుర్కోవచ్చని సూచించారు.

పెద్దపల్లి జిల్లా జి.స.డి.ఓ, సెక్టోరల్ అధికారి *జంపాల పద్మ* గారు మాట్లాడుతూ పదవతరగతి ఫలితాలలో పెద్దపల్లి జిల్లాను ముందంజలో ఉంచడానికి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి సిద్దంగా ఉన్నామన్నారు.ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్.ఎం.సి. చైర్మెన్ సంపూర్ణ,ఉపాధ్యాయులు అస్మా పర్వీన్, వి.భాగ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

Goal Setting at valmeeki vidyalayam on 3.12.2017

JAAGO BADLO BOLO TOT TRAINING AT TSIPARD 7.12.2017 TO 8.12.2017 WITH DSP VIJAY KUMAR, SCERT PROFESSOR RAMADEVI SI NAGARJUN REDDY RESOURCE PERSONS ASIYA SHERVANI, RADHIKA, SNEHA

Mount carmel 13.12.2017 Motivational Class for x class students

ARTICLE ON POCSO ACT 5.1.18 NAMASTE TELANGANA MIDDLE PAGE 4 DISTRICTS COVERED

Goal Setting to x class students at ZPHS ENDAPALLY & ZPHS KONDAPUR ON 9.1.18

ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డా.అట్ల శ్రీనివాస్ రెడ్డికి సత్కారం

 

          తేది: 08.02.2018 రోజున ఫిలింభవన్ కరీంనగర్ యందు కళానిలయం సాంస్కృతిక మరియు సేవాసంస్థ కరీంనగర్ ఆధ్వర్యంలో డా. కె.వి. రమణాచారి ఐ.ఏ.ఎస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహా దారులు 66 వ జన్మదిన వేడుకల సందర్భంగా డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ని కె.శ్రీనివాసా చారి అధ్యక్షులు, కె.బి. శర్మ ప్రధాన కార్యదర్శి లు ఘనంగా సన్మానంతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తితో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా వివిధ ప్రాంతాలలో కౌన్సెలింగ్ సైకాలజీ రంగంలో, విద్యార్థులకు పరీక్షల భయాన్ని తొలగించేందుకు మానసిక వికాస శిక్షణా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు లక్ష్యసాధన దిశ గా మార్గనిర్దేశనం చేస్తున్న డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి సేవలు అభినందమీయమని అన్నారు.

 

          ఈ కార్యక్రమంలో పెగడ పల్లి మండల విద్యాధికారి మిట్టపల్లి అంజా రెడ్డి, దేవాదాయ డిప్యూటి కమీషనర్ దూస రాజేశ్వర్, దాస్యం సేనాధిపతి, డి.పి.ఓ. నారాయణ రావు, నలిమెల భాస్కర్, గండ్ర లక్ష్మణ్ రావు, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, రామక విఠల్ శర్మ, కె.ఎస్. అనంతా చార్య  తదితరులు పాల్గొన్నారు.  

          జగిత్యాల జిల్లా పి.ఆర్.టి.యు. తెలంగాణ ప్రధాన కార్య దర్శి దేవి రమేష్ , పాతూరి రాజ్ రెడ్డి, కొలుముల శ్రీనివాస్ యాదవ్ సైకాలజిస్టులు రఘునందన్ గోవర్ధన శివకుమార్ సంగిత కుమారి పలువురు ఉపాధ్యాయులు జలపతి బలసంకుల రవీందర్ రావు వాయు కుమార్ తదితరులు  అట్ల శ్రీనివాస్ రెడ్డి సత్కారం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.